తమిళ సీనియర్ హీరో విజయకాంత్ ఇకలేరు..

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (09:15 IST)
తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ (70) ఇకలేరు. ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని మియోట్ హాస్పిటల్‌లో  కరోనా తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన పార్థివదేహం ఉన్న మియాట్ ఆస్పత్రితో సహా ఆయన నివాసం, పార్టీ కార్యాలయాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 
 
ఆయన ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయిన విజయ్‌కాంత్.. శ్వాస ఇబ్బందులతో  విజయ్ కాంత్ బుధవారం మరోసారి ఆస్పత్రిలో చేర్పించారు. రెగ్యులర్ చెకప్ కోసమేనని, రెండ్రోజుల్లో తిరిగి ఇంటికి చేరుతారని తెలిపిన కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రి వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన గురువారం తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి అధికారికంగా వెల్లడించింది. 
 
కాగా, ఆయనకు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులున్నారు. తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా విజయ్ కాంత్ గుర్తింపు పొందారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోల సరసన చేరారు. 2005లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) పేరుతో పార్టీని స్థాపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట

Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల

Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో రిలీజ్

Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments