Webdunia - Bharat's app for daily news and videos

Install App

దియా మీర్జా విడిపోవడానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు కారణమా? కనిక ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (15:00 IST)
దియా మీర్జా తన భర్త షాహిల్‌తో విడిపోతున్నట్లు తెలిపింది. ఐతే దీనికి కారణం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కోడలు కారణమంటూ బాలీవుడ్ వెబ్ సైట్లు పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడిని బాలీవుడ్ స్క్రీన్ రైటర్ కనిక థిల్లాన్ వివాహం చేసుకున్నారు. కనిక తెలుగులో 'సైజ్ జీరో' సినిమాకి కథ అందించారు. ఆ చిత్రాన్ని ఆమె భర్త ప్రకాష్ డైరెక్ట్ చేశారు. వీరిద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చిత్రాలు చేస్తున్నారు.
 
ఐతే దియా మీర్జా తన భర్త షాహిల్‌తో విడిపోతున్నట్లు ప్రకటించిన తదుపరి దీనికి కారణం కనిక అంటూ వెబ్ సైట్లు రాశాయి. దియా భర్తతో కనికకు ఎఫైర్ వుందంటూ దారుణంగా పేర్కొన్నాయి. ఈ కారణంగానే దియా మీర్జా భర్త నుంచి వేరుపడాలని నిర్ణయం తీసుకున్నారంటూ వెల్లడించాయి.
 
ఐతే ఈ వార్తలను కనిక థిల్లాన్ తీవ్రంగా ఖండించారు. తన జీవితంలో ఇప్పటివరకూ దియా మీర్జాను కానీ ఆమె భర్త షాహిల్ ను కానీ కలిసిందే లేదని ట్విట్టర్లో పేర్కొన్నారు. పనిలేని రెండు టాబ్లాయిడ్లు చెత్త రాతలు రాశాయనీ, వాటిని పట్టించుకోనవసరం లేదని కొట్టిపారేశారు. తన పనిలో తను నిమగ్నమవుతున్నట్లు తెలిపారామె.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments