Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (16:14 IST)
ఆధునికత పెరిగిన తరుణంలో చిన్న విషయాలకు విడాకుల వరకు తీసుకెళ్లే జంటలు పెరిగిపోతున్నాయి. అలాంటి వారు ఈ వృద్ధ జంట గురించి తెలిస్తే షాకవక మానరు. 70ఏళ్ల వయస్సులో ఈ దంపతులు 23 దేశాలు తిరిగొచ్చారు. 23 దేశాలు తిరిగొచ్చారే వారి వద్ద భారీగా ఆస్తులున్నాయని అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్టే. 
 
ఆ వృద్ధ జంట వద్ద ఆస్తుల్లేవు. ఒక్కే ఒక్క టీ కొట్టు మాత్రమే వుంది. ఆ టీ కొట్టును ఆధారంగా చేసుకుని విదేశాలు తిరిగొస్తారు. తిరిగొచ్చాక ఆ అప్పును తీర్చుకుంటారు. ఇది ఆ 70 ఏళ్ల వృద్ధ దంపతుల కథ. కేరళలోని కొచ్చి నగరంలో గిరినగర్‌లో శ్రీ బాలాజీ కాఫీ హౌస్‌ను విజయన్, ఆయన భార్య మోహన కలిసి నడుపుతున్నారు.
 
24 గంటల పాటు కష్టపడి టీ కొట్టును నిర్వహించే ఈ జంట.. విదేశాలకు ట్రిప్పేసే ముందు.. టీ కొట్టుని బ్యాంకుకు తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. తిరిగొచ్చాక కష్టపడి ఆ అప్పు కట్టేస్తారు. రెండు, మూడేళ్లు కష్టపడి అప్పు తీర్చాక మరో పర్యటనకు సిద్ధమవుతారు. 
 
వీళ్ల గురించి తెలుసుకున్న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర.. ఈ జంట గురించి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దేశంలోని అత్యంత ధనికులు వీళ్లేనని.. కొచ్చికి వెళ్లినపుడు విజయన్ టీకొట్టుకు వెళ్లి టీ తాగి వస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments