Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో ఓ జంట ముద్దులే ముద్దులు.. ఆ తర్వాత ఏం జరిగింది?

Webdunia
బుధవారం, 26 మే 2021 (19:24 IST)
couple
పాకిస్థాన్‌కు చెందిన ఒక జంట విమానంలో చేసిన పాడుపని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమానంలో ఉన్నామన్న సంగతి మరిచి వారిద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. అయితే ఇది చూసిన తోటి పాసింజర్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మే 20న చోటుచేసుకుంది.
 
విషయంలోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్‌ నాలుగో వరుసలో కూర్చున్నారు. ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్‌ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు. ఆమె వెళ్లి మీ చర్యలతో చుట్టుపక్కల వాళ్లకు అభ్యంరతం ఉందని.. ఇలాంటివి చేయకూడదని వివరించింది. అయినా వారు పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోయారు. దీంతో ఎయిర్‌ హోస్టస్‌ వారికి బ్లాంకెట్‌ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది.
 
అయితే బిలాల్‌ ఫరూక్‌ ఆల్వీ అనే అడ్వకేట్‌ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ దంపతులు చేసే పనిపై ఎలాంటి చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్‌ కాకుండా చూసుకోవాలని మందిలించారు. అయితే అప్పటికే ఈ వార్త సోషల్‌ మీడియాకు పాకడంతో వైరల్‌గా మారింది. విమానంలో కపుల్‌ చేసిన పనిపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments