Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో హంగ్ తప్పనిసరి.. పవన్ వచ్చినా బీజేపీదే గెలుపట.. కాంగ్రెస్‌కు?

కర్ణాటక బాగేపల్లి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సినీ నటుడు సాయికుమార్ బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. తెలుగు ప్రజలు అధికంగా వుండే బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కర్ణాట

Webdunia
మంగళవారం, 1 మే 2018 (17:46 IST)
కర్ణాటక బాగేపల్లి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సినీ నటుడు సాయికుమార్ బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. తెలుగు ప్రజలు అధికంగా వుండే బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
 
ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ప్రధాని మోదీ కూడా కర్ణాటకలో వరుసగా సభలు పెడుతున్నారు. కానీ కర్ణాటకలో ఏ పార్టీకి అధికారం రాదని పోల్ సర్వేలు తెలిపాయి. కర్ణాటకలో హంగ్ తప్పదని పలు సంస్థలు తమ సర్వే రిపోర్టులో వెల్లడించాయి. కానీ సీ ఫోర్ సర్వే మాత్రం కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వస్తాయని చెబుతూ బీజేపీకి షాకిచ్చింది. 
 
రాష్ట్రంలోని 165 నియోజకవర్గాల్లోని 24,679 మంది ఓటర్లను సర్వే చేస్తూ సీ ఫోర్ ఫలితాలను తెలిపింది. 2017లో 340 పట్టణాలు, 550 గ్రామాలకు చెందిన అన్ని కులాల వారినీ తమ తొలి సర్వేలో భాగం చేస్తూ, కాంగ్రెస్‌కు 120 నుంచి 132 సీట్లు వస్తాయని సీ ఫోర్ తెలిపింది. ఇక, బీజేపీకి 60 నుంచి 72 సీట్లు, జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్లు, ఇతరులకు 1 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments