కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ వెన్నులో వణుకు.. ఎందుకు?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్, బీజేపీలతో పాటు.. జేడీఎస్ పార్టీలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

Webdunia
గురువారం, 3 మే 2018 (08:55 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్, బీజేపీలతో పాటు.. జేడీఎస్ పార్టీలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకు పుట్టేలా ఆర్ఎస్ఎస్ ఓ వార్తను వెల్లడించింది.
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి 70కిమించి సీట్లు రావని అంచనావేసి ఖంగుతినిపించింది. ఈ నివేదికను దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్‌ వి.నాగరాజ్‌ బెంగళూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు స్వయంగా అందజేసినట్లు సమాచారం. ఇక.. కాంగ్రెస్ పార్టీకి 115 నుంచి 120 సీట్లు, జేడీఎస్‌కు 29 నుంచి 34 సీట్లు లభిస్తాయని అందులో ప్రస్తావించడం గమనార్హం. 
 
రాష్ట్రంలో అహింద (అల్పసంఖ్యాకులు, బలహీనవర్గాలు, దళితుల) ఓట్లను క్రోడీకరించే విషయంలో బీజేపీ విఫలమైందని ఆర్‌ఎస్ఎస్‌ తన సమీక్షలో పేర్కొన్నట్లు భోగట్టా. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు లింగాయత్‌ కులస్తులపై పట్టు తప్పిందనీ, గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి పార్టీలో మళ్లీ పెద్దపీట వేయడం, వీటికి తోడు జీఎస్టీ ప్రభావం, నిరుద్యోగ సమస్య, అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు బీజేపీపై ప్రజల్లో సదాభిప్రాయం లేకుండా చేస్తున్నాయని ఆర్ఎస్ఎస్ సర్వేలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil నిఖిల్ హిస్టారికల్ యాక్షన్ స్వయంభు టీజర్ రాబోతోంది

ఆల్ఫా చిత్రంతో సరిపడే వినోదాన్ని అందిస్తాం : హీరో హేమంత్ కుమార్

Indraja: ఇంద్రజ కీలక పాత్రలో విప్లవ వీరుడు షూటింగ్ ప్రారంభం

తిరుమల లడ్డూలో ఒక్క పర్సెంట్ కూడా నెయ్యి లేదు: నటి మాధవీ లత వీడియో

సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ మరలా వచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

తర్వాతి కథనం
Show comments