Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీ వివాహం.. సోషల్ మీడియాలో వైరల్

దేశ రాజకీయ నేతల్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈయన వయసు నాలుగు పదులు దాటినప్పటికీ పెళ్లి మాట అనుకోవడం లేదు.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (11:51 IST)
దేశ రాజకీయ నేతల్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈయన వయసు నాలుగు పదులు దాటినప్పటికీ పెళ్లి మాట అనుకోవడం లేదు.
 
ఈనేపథ్యంలో, రాహుల్ గాంధీ పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్‌ను ఆయన పరిణయం ఆడనున్నారని గతకొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుకార్లపై అదితి తొలిసారి స్పందించారు.
 
అన్నాచెల్లెళ్ల మధ్య వివాహం జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆమె... పుకార్లను వినగానే తన ప్రపంచం తలకిందులైనట్లు అనిపించిందన్నారు. ఈ వార్తలో ఎటువంటి నిజమూ లేదని, తన చేత్తో రాఖీ కట్టిన రాహుల్ గాంధీ, తనకు అన్నయ్యని, ఈ పుకార్లతో తాను చాలా బాధపడ్డానని అన్నారు. 
 
కాగా, రాయ్ బరేలీలోని వాట్స్ యాప్ గ్రూపుల నుంచి ఈ పుకార్లు ప్రారంభం కాగా, దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇక అదితి సింగ్, రాయ్ బరేలీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ సింగ్ కుమార్తె. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. 
 
యూఎస్‌లోని డ్యూక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె, గత ఎన్నికల్లో 90 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రియాంకా గాంధీకి అదితి సన్నిహితురాలు కూడా. అందువల్లే ఆమెకు, రాహుల్‌కు వివాహమంటూ ఎవరో పుకార్లు సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments