ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన చంద్రయాన్ 2 ల్యాండింగ్ విఫలం కావడంతో భారతీయులంతా నిరుత్సాహం చెందినప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలు మనల్ని చంద్రుని ముంగిటవరకూ తీసుకుని వెళ్లారని సంతోషం వ్యక్తం చేశారు. ఐతే చంద్రయాన్ 2 ఇక ముగిసిన అధ్యాయం అనుకుంటున్న తరుణంలో ఇస్రో చైర్మన్ శివన్... విక్రమ్ ఆచూకిని చంద్రునిపై కనుగొన్నట్లు వెల్లడించారు. ఐతే కమ్యూనికేషన్ దొరకలేదనీ, దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదిలావుంటే తాజాగా ఓ వైరెట్ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. వైరెడ్ అనే ట్విట్టర్ నుంచి ఓ వ్యక్తి చేసిన ట్వీట్ చూస్తే... గ్రహాలు, ఉపగ్రహాల పైన కొన్ని రకాల బ్యాక్టీరియాలు వుంటాయి. అలాంటిదే టార్డిగ్రేడ్. దీనిని తెలుగులో నీటి ఎలుగుబంటి అంటారు. ఇది చూసేందుకు నీటి బుడగలుగా కనిపిస్తూ లోపల చిన్నచిన్న చిప్స్‌లా మెరుస్తూ కనిపిస్తుంటుంది. దీన్ని మామూలుగా చూడలేం.
You're looking at the toughest animal in the known universe. This is a tardigrade (aka water bear) and now, thanks to a crashed lunar lander, thousands of them are on the moon. Yes, the moon.