చంద్రయాన్-2 ప్రాజెక్టుపై ఇస్రో ఛైర్మన్ శివన్ నాయర్ స్పందించారు. చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ అనుకోని రీతిలో మొరాయించిందనీ అందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. చంద్రయాన్ -2 ప్రయోగం తీరు తెన్నులపై స్పందించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం కాస్తలో విఫలమైందన్నారు. చంద్రుని ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ అనుకోని రీతిలో మొరాయించిందని, లేకుంటే చంద్రయాన్-2 ద్వారా భారత కీర్తిపతాక విశ్వవీధిలో మరోసారి రెపరెపలాడేదని తెలిపారు.
ఈ ప్రయోగం తీరుతెన్నులపై ఇస్రో ఛైర్మన్ శివన్ స్పందించారు. మీడియా ముందుకొచ్చిన ఆయన ఈ ప్రక్రియ చివరి నిమిషాల్లో తమ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందన్నారు.
చివరి దశ తాము అనుకున్న విధంగా సాగలేదని, విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని తెలిపారు.