Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

పేరుమోసిన క్రిమినల్ లాయర్ కన్నుమూత

Advertiesment
Ram Jethmalani
, ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (10:41 IST)
దేశంలో పేరుమోసిన క్రిమినల్ లాయర్‌గా పేరుమోసి, కేంద్ర మాజీ మంత్రి, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. రాంజెఠ్మలానీ 70 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ, ఎన్నో వివాదాస్పద కేసులను వాదించారు.
 
తన 94 ఏళ్ల వయసు వరకూ న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. ఆయన తన 17 ఏళ్ల వయసులోనే న్యాయవాదిగా మారారు. అవిభాజ్య భారత్‌లో 1923, సెప్టెంబరు 14న పాకిస్థాన్‌లోని శికార్పుర్‌లో రామ్‌జెఠ్మలానీ జన్మించారు. అతని తండ్రి న్యాయవాది. చదువులో ఎంతో చురుకుగా ఉండే రామ్‌జెఠ్మలానీ రెండు, మూడు, నాలుగు తరగతులను ఒకే సంవత్సంలో పూర్తిచేసి, 13 ఏళ్ల వయసులోనే మెట్రిక్ పాసయ్యారు.
 
ఆ తర్వాత  ఆ తర్వాత 17 యేళ్లకే న్యాయవాదిగా పట్టా అందుకున్నారు. అయితే అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు 21 ఏళ్ల వయసు ఉండాలి. అయితే రాంజెఠ్మలానీ తన ప్రతిభతో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు వయసు సడలింపుపై అనుమతి పొందారు. 
 
కాగా అతని తండ్రి రామ్‌జెఠ్మలానీని లాయర్ చేయాలనుకోలేదు. మెట్రిక్ పూర్తిచేసిన రామ్‌జెఠ్మలానీని సైన్స్ కోర్సులో చదివించాలనుకున్నారు. అయితే రామ్‌జెఠ్మలానీ న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నట్లు తండ్రి ఎదుట స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితుడి భార్యతో అక్రమ లింకు.. అడ్డుగా ఉందనీ భార్య హత్య