బెంగుళూరులో రాపిడో బైక్ రైడర్ చేసిన వేధింపుల ప్రయత్నం నుండి తప్పించుకోవడానికి కదులుతున్న బైక్ నుండి దూకింది. ఈ సంఘటన మొత్తం లోకల్ సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ చేయబడింది. మహిళ ఇందిరానగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి చేరుకోవడానికి బైక్‌ను బుక్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఓటీపీ వస్తుందనే సాకుతో రైడర్ ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని డ్రైవింగ్ చేసిన రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఇందిరానగర్‌కు బదులు దొడ్డబళ్లాపూర్ రోడ్డు వైపు రూట్ మార్చాడు. ఇదేంటని ప్రశ్నించగా వేగంగా వెళ్లాడు.
అయితే యలహంక సమీపంలోని నాగేనహళ్లిలోని బీఎంఎస్ కళాశాల సమీపంలో బైకుపై వున్న వున్న మహిళ వాహనంపై నుంచి దూకేసింది. ఈ ఘటనతో ఆమె చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. కళాశాల గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు సహాయం చేయడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.