Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. సురక్షితంగా రప్పించండి... అభినందన్ ఫ్యామిలీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:58 IST)
పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్, మిగ్ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను ఎలాగైనా సురక్షితంగా దేశానికి తీసుకుని రావాలని అతని కుటుంబం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 
 
భారత రక్షణ స్థావరాలపై దాడులు చేసేందుకు వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే ప్రయత్నాల్లో భాగంగా ఒక శత్రుదేశ యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్... తాను నడుపుతున్న మిగ్ జెట్ కుప్పకూలిపోయింది. దీంతో అతను పాక్ భూభాగంలో పడిపోవడంతో పాకిస్థాన్ సైనికులు పట్టుకున్నారు. 
 
ఆ తర్వాత అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో రక్తం ధారగా ప్రవహించింది. ఈ ఫోటోలను టీవీలో చూపించారు. వీటిని చూసిన అభినందన్ ఫ్యామిలీ తట్టుకోలేక పోయింది. చేతులు వెనక్కి కట్టేసి, కళ్లకు గుడ్డ కట్టి వున్న అభినందన్‌ను చూసిన దేశ ప్రజలంతా చలించిపోయారు. 
 
ఈ నేపథ్యంలో జెనీవా ఒప్పందం మేరకు అభినందన్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇదే వినతిని ఆయన కుటుంబ సభ్యులు కూడా చేశారు. దీనిపై అభినందన్ మేనమామ గురునాథన్ స్పందిస్తూ, 'నేను అభి విజువల్స్‌ను టీవీల్లో చూశా. తనను ఈ చేతుల్తో ఎత్తుకుని పెంచా. ప్రభుత్వం ఎలాగైనా తనను వెనక్కు తీసుకురావాలి' అని విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, అభినందన్ సొంతూరు తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా తిరుప్పనూరు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ఢిల్లీలో నివశిస్తున్నారు. అభినందన్ భార్య తన్వి మోర్వాహా కూడా ఓ మాజీ పైలట్. 
 
ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అభినందన్... తన తండ్రి సింహకుట్టి వర్ధమాన్ బాటలోనే పయనించారు. సింహకుట్టి కూడా ఓ మాజీ పైలట్. ఎయిర్ మార్షల్‌గా పని చేశారు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అభినందన్.. చెన్నైలోని తాంబర్ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో శిక్షణ తీసుకున్నారు. సింహకుట్టి వర్ధమాన్ ప్రస్తుతం తాంబరంలోని ఎయిర్‌ఫోర్స్ క్వార్టర్స్‌లో నివశిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments