Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తెలిద్దరూ శివపార్వతులు, నేను కాళికా దేవిని (Video)

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (10:41 IST)
మదనపల్లి జంట హత్యల కేసులో నిందితురాలైన పద్మజ చెబుతున్న ఒక్కో విషయం విని పోలీసులు షాక్ తింటున్నారు. తన కుమార్తెలిద్దరూ శివపార్వతులనీ, తను కాళికా దేవినంటూ చెప్పుకుంటున్నారట. అంతేకాదు.. తను చెప్పే విషయాలను శివుడు.. అంటే తన పెద్దకుమార్తె వింటుందనీ, శివుడు చెప్పే మాటలను తను తు.చ తప్పకుండా పాటిస్తానని వెల్లడించిందట.
 
మరోవైపు ఆమెను ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఆమె మానసిక స్థితి సరిగా లేదని తేల్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో దోషులు తల్లిదండ్రులు. బిడ్డల్ని చంపేశామన్న పశ్చాత్తాపం ఏ మాత్రం వారిలో కనిపించలేదు. ముఖ్యంగా నిన్న సాయంత్రం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు వీరిద్దరినీ.
 
14 రోజుల పాటు రిమాండ్‌కు పంపించారు. అయితే జైలులో ఏ మాత్రం బాధపడకుండా పద్మజ హాయిగా మెడిటేషన్ చేసుకుని కూర్చుని ఉందట. కేవలం గంట మాత్రమే ఆమె నిద్రపోయిందట. మిగతా సమయం మొత్తం నేను శివుడ్ని అంటూ చెప్పుకుందట.
 
నేను శివుడ్ని, నన్ను కరోనా ఏమీ చేయలేదు నాకు పరీక్ష చేస్తారా.. నేను ధ్యానంలో ఉన్నాను. అన్ని రోగాలు తొలగిపోతాయి. ఇలా ఏవేవో చెప్పుకుంటూ గట్టిగా అరుస్తూ సబ్ జైలులో కూర్చుందట పద్మజ. దీంతో జైలు సూపరింటెండెంట్ రామక్రిష్ణ నాయక్ ఉదయాన్నేభార్యాభర్తలిద్దరినీ మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్ళారట.
 
ఆసుపత్రిలో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారట. దీంతో మెజిస్ట్రేట్ ఆదేశాలతో తిరుపతి రుయాకు నిందితులిద్దరినీ తీసుకువస్తున్నారు. వారిద్దరికీ రుయాలో ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత తిరిగి మదనపల్లె ప్రభుత్వ సబ్ జైలుకు తరలిస్తారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments