Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి అత్తెసరు మెజార్టీ... ఒక్క ఎంపీ హ్యాండిచ్చినా మైనార్టీ సర్కారే

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి మున్ముందు కష్టాలు తప్పేలా లేవు. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా హ్యాండిస్తూ వస్తున్నాయి. దీంతో గతంలో తిరుగులేని కూటమి లేదా ప్రభుత్వంగా ఉన్న బీజేపీ ఇప

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (09:31 IST)
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి మున్ముందు కష్టాలు తప్పేలా లేవు. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా హ్యాండిస్తూ వస్తున్నాయి. దీంతో గతంలో తిరుగులేని కూటమి లేదా ప్రభుత్వంగా ఉన్న బీజేపీ ఇపుడు అత్తెసరు మార్కులతో కాలాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
నిజానికి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300 పైచిలుకు సీట్లు రాగా, ఒక్క బీజేపీకే 282 సీట్లు వచ్చాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీని దక్కించుకుంది. అయితే, తర్వాత కాలంలో బీజేపీ బలం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. సభ్యులు మరణించినపుడు జరిగే ఉప ఎన్నికల్లో తిరిగి బీజేపీ అభ్యర్థులు గెలవకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 
 
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు కోల్పోవడంతో బీజేపీ బలం 272కు పడిపోయింది. ఇది సరిగ్గా అత్తెసరు మార్కులతో కూడిన మెజార్టీలో ఉంది. ఇందులో ఏ ఒక్క ఎంపీ హ్యాండిచ్చినా సాంకేతికంగా ప్రధాని మోడీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్టే. నాలుగేళ్ల క్రితం బీజేపీకి 282 సీట్లు వుండగా ఇపుడు ఆ సంఖ్య 272కు పడిపోయింది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇపుడు బొటాబొటి మెజార్టీతో అధికారంలో కొనసాగుతోంది. 
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లతో అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ ఈ నాలుగేళ్లలో నాలుగు సీట్లు పెంచుకుంది. బీజేపీకి 10 సీట్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా 7 సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి ఫలితాలు మరికొన్ని పార్టీల భవితను నిర్దేశించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments