Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో డీల్ ఫిక్స్ : బీజేపీ - జేజేపీ సంకీర్ణ సర్కారు... అమిత్ షా

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (22:28 IST)
తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన హర్యానా రాష్ట్రంలో మరోమారు బీజేపీ సారథ్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకానుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.
 
మొత్తం 90 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ 31 సీట్లతో సరిపుచ్చుకోగా, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లను గెలుచుకుని కింగ్ మేకర్‌గా అవతరించింది.
 
ఈ ఫలితాలు ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కనీస మెజార్టీ 46 సీట్లు దక్కలేదు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతలాతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడంతో ఆయన బీజేపీకి జై కొట్టారు. 
 
ఇందుకు ప్రతిఫలంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవిని కమలనాథులు కట్టబెట్టనున్నారు. అలాగే, ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఉండనున్నారు. మరోవైపు, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోమారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. శనివారం జరిగే బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో ఆయన పేరును ఎన్నుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments