బిగ్ బాస్ సీజన్-2.. కిరీటి ఎలిమినేట్.. గీత, గణేష్ సేఫ్ జోన్‌లోకి?

బిగ్ బాస్ సీజన్-2 మూడో వారానికి చేరుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో మూడోవారంలో నటుడు కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లోని అత్యధికులు కిరీటిని బయటకు పంపించాలని నిర్ణయించారు. ఈ న

Webdunia
సోమవారం, 2 జులై 2018 (11:52 IST)
బిగ్ బాస్ సీజన్-2 మూడో వారానికి చేరుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో మూడోవారంలో నటుడు కిరీటి దామరాజు ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లోని అత్యధికులు కిరీటిని బయటకు పంపించాలని నిర్ణయించారు. ఈ నిర్ణం ప్రకారం బయటకు వచ్చిన కిరీటిని బోన్‌లో నిలబెట్టిన హోస్ట్ నాని, కిరీటి మంచి వ్యక్తని చెబుతూ, హౌస్‌లోని కంటెస్టెంట్‌లను కిరీటి గురించి మాట్లాడాలని అడిగాడు. 
 
కిరీటి గురించి తనీష్, బాబు గోగినేని, సామ్రాట్ తదితరులు పాజిటివ్‌గా చెబుతున్న వేళ కిరీటి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తొలివారంలో పర్లేదు కానీ.. రెండో వారంలో కెప్టెన్ టాస్క్‌ తీసుకుని కౌశల్ పట్ల వికృతంగా ప్రవర్తించడం చేశాడు. ముఖ్యంగా ఒక్క ఎపిసోడ్‌లో కిరీటి తన వైఖరితో ప్రేక్షకులకు దూరమయ్యాడని ఈ సందర్భంగా నాని తెలిపాడు. 
 
తాను హౌస్‌లో బాగానే ఉన్నా కూడా ఎలిమినేట్ అయ్యానని కిరీటి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలావుండగా, ఎలిమినేషన్ జాబితాలో గీతా మాధురి, కిరీటి, గణేష్‌లు ఉండగా, గీత, గణేష్ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోవడంతో కిరీటి ఎలిమినేషన్ తప్పలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments