Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ ఫోన్, నేను ఎన్టీఆర్ అభిమానినే అన్న ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:01 IST)
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన అంశం నిప్పు రాజేసిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసి 'చలో కావలి' అంటూ పిలుపు ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
 
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలనే విగ్రహాన్ని తొలగించారని దీనికి పోలీసులు కూడా సహకరించారని నెల్లూరు జిల్లా పార్టీ నేతలు చంద్రబాబుకు తెలియజేశారు. అయితే తాజాగా ఇదే అంశం గురించి ఎన్.టి.ఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ , వైసీపీ పార్టీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కు ఫోన్ చేసి విగ్రహం తొలగించాల్సిన అవసరం ఏముందని ఆరా తీశారు.
 
అయితే ఎన్టీఆర్ విగ్రహం యొక్క వీపు భాగం ఆలయానికి ఎదురుగా ఉన్నందున స్థానికులు తొలగించడం జరిగిందని, వివాదస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బాలకృష్ణకు హామీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్. తాను కూడా చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అభిమానిని అని బాలకృష్ణకు తెలియజేయడం విశేషం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments