Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు మూడోసారి కరోనా పాజిటివ్వే...

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:00 IST)
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు మూడోసారి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన మరింత కాలం ఆస్పత్రిలోనే ఉండాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. అంటే మరో మూడు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ రెండు వారాల్లో ఉన్న అన్ని పర్యటనలను ఆయన వాయిదా వేసుకున్నారు. 
 
ప్రస్తుతం కరోనా కేసుల నమోదులో అమెరికా తర్వాత అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాగానే బోల్సోనారో కూడా కరోనాను తేలికగా తీసుకున్నారు. కరోనాను సాధారణంగా వచ్చే ఒక ఫ్లూగా ఆయన అభివర్ణించారు. 
 
వైద్య, ఆరోగ్య సంస్థుల సూచించినట్లు ఆయన మాస్క్‌లు ధరించలేదు. సామాజిక దూరం పాటించలేదు. ఆయన పార్టీలోని వారిని కలిసినప్పుడల్లా వారికి షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తూ, ఆలింగనం చేసుకున్నారు. ఫలితంగా ఆయన జూలై 7వ తేదీన కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments