Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష్ణ రాజు, మాట తప్పని మడమ తిప్పని సీఎం నిలబెట్టుకుంటారనీ...

రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష్ణ రాజు, మాట తప్పని మడమ తిప్పని సీఎం నిలబెట్టుకుంటారనీ...
, మంగళవారం, 21 జులై 2020 (15:08 IST)
భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలియజేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. మంగళవారం ఉదయం రాష్ట్రపతిను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ అమరావతి భూముల వ్యవహారం, బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాను అన్నారు.
 
ఈ విషయంలో అటార్నిజనరల్ సలహా తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు సూచించాలని రాష్ట్రపతిని కోరాను అన్నారు.  నా విషయంలో మొదటి నుంచి జరుగుతున్న పరిణామాలను వివరించాను అని అన్నారు. ఇంకా ఏమన్నారు అంటే.. తెలుగు భాష విషయంలో రాజ్యాంగం కంటే పార్టీ మ్యానిఫేస్టో ముఖ్యం అన్న విధంగా మా పార్టీ వ్యవహరిస్తుంది. తెలుగు భాష విషయంలో లోక్‌సభలో మాట్లాడిన విషయాన్ని నాకు జారీ చేసిన షోకాజు నోటీసు, నా అనర్హత పిటీషన్లో ప్రస్తావించారు.
 
తప్పనిసరి పరిస్థితులలోనే నా భధ్రత గురించి లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రికి లేఖ రాశాను. భద్రత కల్పించే అంశం బాగా ఆలస్యం అవుతున్నందున కోర్టుకు వెళ్లాను. ఈ విషయాలన్నింటినీ  రాష్ట్రపతికి వివరించాను. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన భాధ్యతలలో భాగంగా ప్రజాసమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లాను. ప్రభుత్వం, పార్టీ మధ్య తేడా మా పార్టీ నేతలకు తెలియదు.
 
ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రకారం నాకు ఉంది. పార్టీ దురాభిమానులు ఈ విషయాన్ని గమనించాలి, గ్రహించాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశిస్తే తప్పుడు కేసులు పెడతారని భయపడకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. ఏపి రాజధానిగా అమరావతి ఉండే విధంగా అందరూ కలసి రావాలి.
 
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కమ్మ కులం వారు 18 శాతం, రెడ్డి కులం వారు 20 శాతం పైగా, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం వారు ఎక్కువ సంఖ్యలో భూములు ఇచ్చారు. మాట తప్పి, మడమ తిప్పని సీఎం రాజధాని అమరావతి విషయంలో మాట నిలబెట్టుకోవాలి అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంకా నగర ప్రభువు విమానయానంపై శ్రీలంక పరిశోధన