లంకా నగర ప్రభువు రావణాసురుడు. ఈ లంకాధీసుడైన రావణాసురుడు విమానంలో ప్రయాణించినట్టు శ్రీలంక పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇదే అంశంపై అధ్యయనం కూడా చేస్తున్నట్టు చెప్పింది.
లంకా నగర ప్రభువు విమానయానానికి సంబంధించిన సమాచారాన్ని తమకు ఇవ్వాలంటూ విమానయాన సంస్థ ప్రజలను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ ప్రటకన చేసింది. రావణాసురుడు ప్రయాణించిన ఆకాశమార్గాలపై తాము అన్వేషణ చేయనున్నామని, దానికి సంబంధించిన సమాచారం ఉంటే తమకు ఈవెయిల్, ఫోన్ చేయాలని శ్రీలంక విమానయాన శాఖ ఆ యాడ్‌లో పేర్కొన్నది.
రావణుడి విమానయానం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని క్రోఢీకరించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఓ అధికారి తెలిపారు. వేల సంవత్సరాల క్రితం శ్రీలంకను రావణాసురుడు ఏలినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అయితే రావణుడు అనేక గగన మార్గాల్లో విమాన ప్రయాణం చేసినట్లు కూడా కథలు ఉన్నాయి. ఆ మార్గాలను తెలుసుకునేందుకు స్టడీ చేపట్టినట్లు సివిల్ యేవియేషన్ అథారిటీ అధికారి ఒకరు చెప్పారు. భారత్ నుంచి వస్తున్న పర్యాటకులకు శ్రీలంకలో రామాయణ సంబంధిత ప్రదేశాలను చూపిస్తుంటారు.