నేను రానని చెప్పకుండానే ఎనౌన్స్ చేశారు, ఇండస్ట్రీ ఆ ఒక్క వ్యక్తిదేనా? చిరుపై బాలయ్య ఇండైరెక్ట్ ఎటాక్

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (09:54 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరు వర్సెస్ బాలయ్య వ్యవహారం ముదిరిపోతోంది. సినిమా షూటింగులకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి తదితరులు కలిసినప్పుడు, ఆ సమావేశానికి తనను ఆహ్వానించలేదని మండిపడ్డారు బాలయ్య. ఆ తర్వాత వాళ్లందరూ భూములు పంచుకోవడానికి వెళ్లారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కుదుపుకు గురైంది.
 
ఇక ఏపీలోనూ సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలంటూ టాలీవుడ్ సెలబ్రిటీలు నిన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గతంలో సీఎం కేసీఆర్ వద్దకు ఎవరెవరు వెళ్లారో వారే హాజరయ్యారు. ఈ సమావేశానికి బాలయ్యను ఆహ్వానించినా తన పుట్టినరోజు వేడుకల్లో బిజీ వల్ల ఆయన రాలేకపోతున్నారంటూ నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు.
 
దీనిపై తాజాగా బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ముఖ్యమంత్రిని కలవాలని ఎవరు డిసైడ్ చేస్తారు. సినిమా చాంబరా లేదంటే ఒక వ్యక్తా? ఎవరో ఒక వ్యక్తి పేరు మీద సీఎం అపాయింట్మెంట్ ఇస్తే దానికి నేను వెళ్లాళా? ఈ విషయంపై తనతో సంప్రదించినప్పుడు ఆలోచిస్తానని చెప్పాను కానీ రానని చెప్పలేదు.
 
ఇంతోలోనే నేను రానన్నానంటూ మీడియాలో ప్రకటించేశారు. నేను చెప్పకుండా నా ప్రకటనగా వారెలా చెప్తారు. ఏదైనా ఫిలిమ్ ఛాంబర్ నిర్ణయిస్తే దాని ప్రకారం నడుచుకుంటాం కానీ ఎవరో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తామా అంటూ ప్రశ్నించారు. మరి దీనిపై చిరు-నాగ్ బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవి ని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments