Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భారతరత్న' వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమం

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనను రొటీన్ చెకప్ నిమిత్తం సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సింద

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (11:38 IST)
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనను రొటీన్ చెకప్ నిమిత్తం సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన విషయం తెల్సిందే. పైగా, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలు ఆయన్ను వెంటాడుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌కు తరలించగా, ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తూ, వాజ్ పేయికి ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఆయన పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు గమనిస్తోందని వెల్లడించారు. 
 
చికిత్సకు వాజ్‌పేయి స్పందిస్తున్నారని అందులో పేర్కొన్నారు. కాగా, శరీరంలోని పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకిన వాజ్‌పేయి పరిస్థితి గురించి వాకబు చేసేందుకు ఎయిమ్స్ వద్దకు బీజేపీ శ్రేణులు తరలివస్తుండటంతో ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఉదయం కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
అలాగే సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ, కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ కూడా ఆస్పత్రికెళ్లిన విషయం తెల్సిందే. ఎండీఎంకే నేత వైగో కూడా ఆస్పత్రికి వెళ్లి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments