Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీవ్ర అనారోగ్య ప‌రిస్థితిలో మాదాల రంగారావు..!

విప్ల‌వ న‌టుడు, నిర్మాత‌, రెడ్‌స్టార్ మాదాల రంగారావు తీవ్ర అస్వ‌స్థ‌త‌తో, శ్వాస‌కోశ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నెల 19 తేదీ సాయంత్రం కుమారుడు డా. మాదాల ర‌వి, రంగారావుగారి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి ఆయ‌న్ని హైద‌రాబాద్ స్టార్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈ

Advertiesment
Madala Rangarao
విప్ల‌వ న‌టుడు, నిర్మాత‌, రెడ్‌స్టార్ మాదాల రంగారావు తీవ్ర అస్వ‌స్థ‌త‌తో, శ్వాస‌కోశ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ నెల 19 తేదీ సాయంత్రం  కుమారుడు డా. మాదాల ర‌వి, రంగారావుగారి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి ఆయ‌న్ని హైద‌రాబాద్ స్టార్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఈ సంద‌ర్భంగా డా.మాదాల ర‌వి మాట్లాడుతూ.. నాన్నగారికి పోయిన సంవ‌త్స‌రం మే నెల‌లో తీవ్ర గుండెపోటు రాగా చెన్నైలోని విజ‌య హాస్పిట‌ల్‌లో చేర్పించ‌డం జ‌రిగింది.
 
ప‌రిస్థితి విష‌మించ‌డంతో హైద‌రాబాద్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌కు అంబులెన్స్‌లో త‌ర‌లించాము. డా. గోపీచంద్ గారు, వారి బృందం చాలా క్రిటిక‌ల్ గుండె ఆప‌రేష‌న్ చేసి నాన్న‌గారిని కాపాడారు. అప్ప‌టి నుండి ఆయ‌న హైద‌రాబాద్‌లోనే డా.ర‌మేష్ గారు, డా.గోపీచంద్ గారు, డా. అనురాధ‌ గారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మా వ‌ద్ద‌నే ఉంటున్నారు. 
 
తిరిగి మే 19న గుండెపోటుతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికాగా స్టార్ హాస్పిట‌ల్‌లో నాన్నగారిని చేర్పించ‌డం జ‌రిగింది. ప్ర‌స్త‌తం ఆయ‌న పూర్తి వెంటిలేట‌ర్‌పై మ‌రియు డ‌యాలిసిస్‌లో ఐ.సి.యులో ఉన్నారు. స్టార్ హాస్పిట‌ల్ సిబ్బంది ఆయ‌న‌ను ర‌క్షించ‌డం కొర‌కు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇంకో 48 గంట‌ల పాటు ప‌రిస్థితి విష‌మంగా ఉంటుంద‌ని తెలియ‌జేశారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ సీఎం విజయన్‌ను కలిసిన కమల్ హాసన్.. ఆ రెండు పార్టీలతో?