Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రిపదవులకు గజపతిరాజు - సుజనా చౌదరీలు రాజీనామా

కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (18:13 IST)
కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.
 
నిజానికి వారిద్దరూ బుధవారం రాత్రే రాజీనామా చేయాల్సి వుంది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ అందుబాటులో లేకపోవడంతో వారు రాజీనామా చేయలేదు. ఆ తర్వాత గురువారం ఉదయం ప్రధాని మోడీ రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు.
 
అక్కడ నుంచి తిరిగివచ్చాక గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో వీరిద్దరూ ప్రధాని మోడీని కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తాము ఏయే కార‌ణాల వ‌ల్ల కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నామో మోడీకి వివరించారు. 
 
కాగా, టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన అశోకగజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రిగా ఉన్నారు. ఈయన కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ విమానాల్లో ప్రయాణించేందుకు అవసరమైన బోర్డింగ్ పాస్‌లు తీసుకునేటపుడు, విమానం ఎక్కేటపుడు ఒక సాధారణ పౌరుడిలా నడుచుకునేవారు. అలాగే, మరో సీనియర్ నేత వైవీఎస్ చౌదరి (సుజనా చౌదరి) కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments