Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు - ఆర్నెలల్లో పూర్తి చేయాలి

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (11:31 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గురువారం సంచలన తీర్పును వెలువరించింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు పిటిషన్లపై సుధీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచన చేసింది. రాజధానిపై చట్టం చేయొద్దని హితవు పలికింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులు చెందాల్సిన అన్ని రకాల ఫలాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. 
 
అలాగే, మూడు నెలల్లో ప్లాన్‌ను పూర్తి చేయాలన్న హైకోర్టు.. చట్టం ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారు ఆరు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలని సూచన చేసింది. అదేసమయంలో అమరావతిలో జరిగే అభివృద్ధి నిర్మాణలపై ఎప్పటికపుడు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. 
 
ముఖ్యంగా, రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను రాజధాని అవసరాలకు మినహా ఇతర అవసరాలకు భూములు తాకట్టు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, మూడు నెలల్లో వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలని, ఆరు నెలల్లో ప్లాట్లకు మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని, ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలని సూచిందింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments