రోజమ్మా... మీకు ఆ పదవి ఓకేనా? సీఎం జగన్ ఫోన్...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (13:57 IST)
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేబినెట్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ కేబినెట్లో ఎవరెవరు ఉంటారన్న చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. పార్టీలో ఉన్న సీనియర్ నేతల మనస్సు నొప్పించకుండా అందరికీ సరిసమానంగా పదవులు కేటాయించాలని, ఎవరూ అలకపాన్పు ఎక్కకూడదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
 
అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి సిఎంగా తానొక్కరే ప్రమాణ స్వీకారం చేసి మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని వారంరోజుల పాటు వాయిదా వేశారు. అందుకు కారణం ఇంకా ఎవరిని తీసుకోవాలోనన్నది క్లారిటీ రాకపోవడమే. కేబినెట్ మంత్రులు అనగానే ప్రధానంగా వినిపించే పేరు రోజా. రోజాకు జగన్ కేబినెట్లో మంచి శాఖే వస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉందన్న ప్రచారంలో ఉంది.
 
ఆమెకు ఏ శాఖ కేటాయించినా ఆ శాఖను సమర్థవంతమైన మంత్రిగా పనిచేయగలదన్నది విశ్లేషకుల భావన. అందుకే రోజాను స్పీకర్ చేసేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నారట జగన్ మోహన్ రెడ్డి. దీంతో నిన్న రాత్రి రోజాకు స్వయంగా జగన్ ఫోన్ చేశారట. రోజమ్మా.. మీరు స్పీక‌ర్‌గా చేస్తారా అని అడిగారట. దీంతో... రోజా... సర్ మీ ఇష్టమంటూ చెప్పారట. కానీ రోజాకు స్పీకర్‌గా ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. కానీ అధినేత చెప్పిన తరువాత ఇష్టం లేకపోయినా సరే చేయాలి కదా. మరి చివరి నిమిషంలో ఏమయినా జరగొచ్చు. చూద్దాం మనం కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments