చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చిన అలీ... పవన్ కల్యాణ్‌కు చెప్పే చేరిన అలీ?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (20:01 IST)
సినీ న‌టుడు అలీ... గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే... తెలుగుదేశం పార్టీలో త‌గిన గుర్తింపు రాక‌పోవ‌డంతో ఈసారి త‌న‌కు ఎవ‌రైతే గుర్తింపు, ఆశించిన ప‌ద‌వి ఇస్తారో ఆ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇటీవ‌ల వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డిని పాద‌యాత్ర స‌మ‌యంలో క‌ల‌వ‌డం... ఆ త‌ర్వాత చంద్ర‌బాబును క‌ల‌వ‌డం... ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌ల‌వ‌డం తెలిసిందే. దీంతో అలీ వైసీపీలో చేర‌నున్నారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి.
 
అయితే.. జ‌గ‌న్‌ని క‌లిసింది వాస్త‌వ‌మే కానీ... పార్టీలో చేరే విష‌యం ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు. ఎవ‌రైతే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇస్తారో ఆ పార్టీలో చేర‌ుతాన‌ని చెప్పారు. ఐతే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటారనీ, గుంటూరు నుంచి పోటీ చేయ‌నున్నారు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. 
 
కానీ... ఏమైందో ఏమో కానీ... అలీ చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చి వైసీపీలో చేరారు. అలీని త‌న పార్టీలోకి ఆహ్వానించారు జగన్. అయితే... ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అలీ పోటీ చేయ‌నున్నారు అనేది తెలియాల్సి వుంది. కాగా వైకాపాలో చేరుతున్న సంగతి పవన్ కల్యాణ్‌కు చెప్పే చేరినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్

శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే

Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్

Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments