ప్రేమికులు రోజు అనే ఒక సందర్భం చూసుకుని కొందరు యువతీయువకులు రెచ్చిపోవడం అక్కడక్కడ కనబడుతుంటుంది. ఇలాంటి ఒక ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. కాలేజీలో చదువుకునే టీనేజర్లు వళ్లు మరిచి నడిరోడ్డుపై చేసిన చేష్టలు ఒకరు వీడియోలో బంధించారు. ఇంతకీ అదేంటయా అంటే... ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో చేసిన ముద్దులగోల.
రోడ్డుపైన యాక్టివా ఆపి ఇద్దరమ్మాయిలతో సరసాలు మొదలుపెట్టాడు ఓ టీనేజ్ యువకుడు. ఒకరి తర్వాత ఒకరికి ముద్దులు పెట్టాడు. ఆపై ఒక అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని అమాంతంపై పైకి లేపి గిరగిరా తిరిగాడు. ఇదంతా మేడపై నుంచి చూసిన ఓ వ్యక్తి చిర్రెత్తిపోయాడు. ఏయ్.. ఏంట్రా నడిరోడ్డు మీద సిగ్గలేకుండా అంటూ పైనుంచి బకెట్ తో నీళ్లు కుమ్మరించాడు. దాంతో వారంతా తడిసిపోయి పరుగులు పెట్టారు. టీనేజ్ యువకుడిపైకి చెంబు విసిరేయడంతో అది కాస్త గురి తప్పింది.