కనువిందు చేసిన రాహుగ్రస్త్య సూర్యగ్రహణం - 12 గంటలకు రింగ్ ఫైర్

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (13:00 IST)
ఆకాశంలో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుగ్రస్త్య సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు బహు సుందరంగా కనిపించాడు. ఆదివారం ఉదయం 9.16 గంటల నుంచి ప్రారంభమైన సూర్య గ్రహణం మధ్యాహ్నం 3.04 గంటల వరకు కొనసాగనుంది. 
 
కాగా, ఉదయం 10.14 గంటలకు ఆకాశంలో సుందరదృశ్యం కనపడి అందరినీ ఆకర్షితులను చేసింది. పూర్తిస్థాయిలో వలయాకార సూర్య గ్రహణం ఏర్పడడం గమనార్హం. సూర్యుడి కేంద్ర భాగం కనపడకుండా అడ్డుగా జాబిల్లి వచ్చింది.
 
తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం సూర్యుడు కనిపిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 వరకు 46 శాతం కనిపిస్తాడు. 
 
ఈ సూర్యగ్రహణంలో భాగంగా సరిగ్గా 12 గంటలకు రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే సంపూర్ణ సూర్యగ్రహణం ఆదివారం కనిపించింది. రింగ్ ఫైర్ అని పలిచే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా ప్రజలకు కనువిందు చేసింది. 
 
చంద్రుడు.. సూర్యుడిని కమ్మేయడంతో ఏర్పడేదే సూర్యగ్రహణం. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలోకి వచ్చినప్పుడు సంభవించే ఈ గ్రహణం భారత్‌లో ఆదివారం ఉదయం 1.19 గంటలకు ప్రారంభమై.. 12 గంటలకు రింగ్ ఫైర్ దర్శనమిచ్చింది.
 
మధ్యాహ్నం 1.45 గంటలకు గ్రహణం పూర్తిగా వీడుతుంది. దాదాపు మూడున్నర గంటలసేపు ఇది ఉంటుంది. భారత దేశంలో గుజరాత్‌లోని ద్వారకాలో ఈ గ్రహణం మొదట కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lokesh Kanagaraj: రజనీకాంత్-కమల్ హాసన్ చిత్రాల నుంచి తప్పుకోవడానికి కారణమదే: లోకేష్ కనగరాజ్

Mahesh Babu: ప్రియాంక చోప్రా నటనను ప్రశంసించిన మహేష్ బాబు

Manchu Manoj: రూత్ లెస్, బ్రూటల్ గా డేవిడ్ రెడ్డి లో మంచు మనోజ్

Sudheer: సుడిగాలి సుధీర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా G.O.A.T (గోట్)

Padma Shri awardees: పద్మశ్రీ విజేతలు తెలుగు సినిమాకు లభించిన జాతీయ గౌరవం మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments