రావులపాలెంలో నా ఫస్ట్ నైట్ సంబరాలు, కొత్త పెళ్లికొడుకు ఫ్లెక్సీతో ప్రదర్శన

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (17:40 IST)
నాలుగు గోడల మధ్య జరిగే ఆ కార్యాన్ని కూడా పబ్లిసిటీ చేసుకున్నాడు ఓ కొత్త పెళ్లి కొడుకు. శోభనం రాత్రిని బాహుబలి యుద్ధంతో పోల్చి పెద్ద విజయం కోసం కత్తులు, కటార్లు వేసుకెళ్తున్నట్లు పోస్టర్లు కూడా వేయించుకున్నాడు. ఆ పోస్టర్లను ఊళ్లో పెట్టింది కాకుండా ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది.
 
రావులపాలెంలో ఫస్ట్ నైట్ సంబరాలు, మొదలైన కొత్త సంస్కృతి పేరుతో ఓ ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇది ఏ జిల్లా రావులపాలెమో ఎవరికీ తెలియదు కానీ పోస్టర్ మాత్రం తిరుగుతోంది. ఇంతకీ అతడు ఏం పెట్టాడంటే... ‘‘నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్ధంగా స్వస్థి పలికి ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న తొలి రేయి అనుభవానికి తహతహలాడుతూ, యుద్ధానికి సిద్ధమైన బాహుబలి వలె ఈ రోజు జరిగే రాత్రి యుద్ధాన్ని ముహూర్త సమయానికి ప్రారంభించి, అతి తక్కువ సమయంలోనే నా తల్లిదండ్రులను నానమ్మ, తాతయ్యలను చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను’’ అనే మాటలు.
 
ఈ వ్యాఖ్యల పక్కన అతడి ఫోటో కూడా వేసుకున్నాడు. ఇది నిజంగా ఊళ్లో పెట్టిందా లేక ఎవరో కావాలని ఇలా పోస్టర్ పెట్టి తమాషా చేశారా అన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం

తర్వాతి కథనం
Show comments