రైలు ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం, చూసినవారంతా షాక్, తేరుకునేలోపే పరార్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:37 IST)
రైలు పట్టాలపై రైలు ఇంజిన్ వస్తుందంటేనే అంతదూరం పరుగుపెడతారు. అలాంటిది రైలు ఇంజిన్ కింద భాగంలో కూర్చుని ఓ యువకుడు ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేసాడు. ఈ షాకింగ్ ఘటన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.


పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ మరికొద్దిసేపట్లో గయా జంక్షన్ వద్ద ఆగబోతోంది. ఇంతలో రైలు ఇంజిన్ నుంచి నుంచి పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో అర్థంకాలేదు.

 
ఇంతలో రైలు గయా స్టేషను వద్దకు చేరుకోగానే... డ్రైవర్ రైలు దిగి అటుఇటూ చూసాడు. ఐతే రైలు ఇంజిన్ కింద నుంచి ఏడుపులు, మంచినీళ్లు కావాలంటూ కేకలు వినిపించాయి. రైలు కింద చూస్తే ఓ వ్యక్తి కనిపించాడు. అతడిని చూసి అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. మెల్లగా అతడిని రైలు ఇంజిన్ కింద నుంచి బయటకు లాగారు. రైలు డ్రైవర్ స్థానిక పోలీసు అధికారులకు విషయాన్ని చెప్పాడు.

 
ఐతే వారు వచ్చేలోపుగానే ఇతడు పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. ఐతే రైలు ఇంజిన్ కింది భాగం విపరీతమైన వేడితో పాటు, వేగానికి కింద జారిపడిపోయే అవకాశం కూడా వుంది. అలాంటిది సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణాన్ని అతడు ఎలా చేసాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments