నాలుగు బెడ్రూంలలో 8 మంది భార్యలు.. అందరినీ ఒప్పించే చేసుకున్నాడట

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (22:19 IST)
ఒక పెళ్ళికే ఎన్నో కష్టాలు పడుతుంటారు. కొంతమంది కాపురాలు సాఫీగా సాగిపోతూ ఉంటే మరికొంతమంది మాత్రం గొడవలు పడి మధ్యలో విడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ భర్త మాత్రం ఏకంగా 8 మందిని పెళ్ళి చేసుకున్నాడు. అది కూడా భార్యలను ఒప్పిస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా అందరితో కలిసి ఉంటున్నాడు.

 
8 మంది భార్యలు ఉన్నారు కదా.. ఇతను బాగా ధనవంతుడయి ఉంటాడని అనుకోవద్దండి.. సామాన్య వ్యక్తే. టాటూలను వేసే షాప్ పెట్టుకుని ఉన్నాడు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ వైవాహిక జీవితం అలా నడుస్తోంది మరి. 

 
టాటూ ఆర్టిస్ట్‌గా ఉన్న ఇతను మొదటి భార్యను స్నేహితుడి పెళ్ళిలో చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత రెండవ భార్యను మార్కెట్లో చూసి, మూడో భార్య హాస్పిటల్ నర్సు.. అలా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఎనిమిది మందిని చేసుకున్నాడు.

 
అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరమేంటంటే తాను ఇంకొక పెళ్ళి చేసుకుంటానని భార్యలకు చెప్పినా అందుకు ఒప్పుకున్న వారు ఏ మాట అనకుండా కలిసి ఉంటున్నారు. అందరూ కలిసే హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారట.

 
అయితే ఇతని ఇంట్లో మొత్తం నాలుగు బెడ్ రూంలు ఉన్నాయట. ఒక్కో బెడ్ రూంలో ఇద్దరు చొప్పున భార్యలు ఉంటారట. ఇలా 8 మందిని పోషిస్తున్నాడట. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తనకు రాలేదని.. అందరూ అక్కచెల్లెళ్ళ లాగా కలిసి ఉన్నారని.. దీంతో నా కుటుంబం చాలా పెద్దదిగా మారిందంటున్నారు. కానీ ఇప్పటివరకు పిల్లలు మాత్రం లేరని ఆవేదనకు గురవుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments