Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్‌ని పెళ్లాడుతానంటూ మొండికేసిన బాలిక, ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన రౌడీ

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (22:20 IST)
మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్ రౌడీ ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రౌడీ కాస్తా హీరోయిన్ కోసం మంచివాడిగా మారిపోతాడు. ఐతే ఆ తర్వాత అతడిపై వున్న రౌడీ మచ్చ తొలగిపోగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటాడు. చివరికి ఎలాగో కథ సుఖాంతమవుతుంది. అది సినిమా. కానీ నిజ జీవితంలో రౌడీని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది. జీవితం నాశనమవుతుంది. 
 
కానీ చెన్నైలోని తిరువేర్కాడుకు చెందిన ఇంటర్ చదువుతున్న ఓ బాలిక మాత్రం తను రౌడీ షీటర్‌ను ప్రేమించాననీ, పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానంటూ పట్టుబట్టింది. బాలిక తండ్రి ఆమెకి ఎంతో నచ్చచెప్పాడు. రౌడీని పెళ్లాడితే జీవితం దుర్భరం అవుతుందనీ, ఆ ఆలోచన మానుకోవాలని చెప్పినా బాలిక వినలేదు. దీనితో విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. 
 
రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు కేసును చిన్నారుల సంరక్షణ చూసే అమ్మ విభాగానికి బదిలీ చేసారు. వాళ్లు బాలికను, ఆమె పేరెంట్స్‌తో పాటు రౌడీ షీటరను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ పైన ఎన్నో కేసులున్నాయనీ కనుక అతడితో ప్రేమ-పెళ్లి వద్దని చెప్పారు. దానికి బాలిక సమాధానమిస్తూ... తను పెళ్లాడి అతడిని మార్చుకుంటాననీ, తన దారిలోకి తెచ్చుకుంటానని చెప్పింది. ఈసారి తలలు పట్టుకోవడం పోలీసుల వంతైంది. 
 
ఐతే ఇదంతా చూస్తూ వున్న రౌడీ షీటర్ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నాడట. బాలిక తనపై ప్రేమ చూపించినా తను ఆమెను పెళ్లాడలేకపోతున్నందుకు మథనపడ్డాడట. జీవితంలో ఎలాంటి తప్పు చేయకుండా బతుకుతానని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లాడట. మరి ఆమె కోసం రౌడీ షీటర్ నిజంగా మారుతాడో లేదో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments