దాచేపల్లి కామాంధుడు సుబ్బయ్య మృతిపై అనుమానాలు

గుంటూరు జిల్లా దాచేపల్లి కామాంధుడు సుబ్బయ్య ఆత్మహత్యపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయనే చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారా? లేదా ఎవరైనా చంపి చెట్టుకు ఉరివేశారా? అనేది ఇపుడు సందేహాస్పదంగా మారింది.

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (17:22 IST)
గుంటూరు జిల్లా దాచేపల్లి కామాంధుడు సుబ్బయ్య ఆత్మహత్యపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయనే చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారా? లేదా ఎవరైనా చంపి చెట్టుకు ఉరివేశారా? అనేది ఇపుడు సందేహాస్పదంగా మారింది.
 
రెండు రోజుల క్రితం దాచేపల్లిలో 9 యేళ్ల బాలికపై సుబ్బయ్య లైంగికదాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు దాచేపల్లి గ్రామస్తులంతా సుబ్బయ్య ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. అదేసమయంలో సుబ్బయ్య కంటికి కనిపించకుండా పారిపోయాడు. మరోవైపు, సుబ్బయ్యను బహిరంగంగా శిక్షించాలంటూ ప్రజలు రెండు రోజుల నుంచి దాచేపల్లిని స్తంభింపజేశారు. 
 
ఈ నేపథ్యంలో సుబ్బయ్య శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఈ ఘాతుకానికి పాల్పడేముందు తన బంధువుతో ఫోనులో మాట్లాడారు. తాను చేయరాని నేరానికి పాల్పడ్డానని, తన పాపం పండిందనీ పేర్కొన్నాడు. అంతేకాకుండా, రేపు ఉదయానికంతా శవమై తేలుతానని చెప్పాడు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే సుబ్బయ్య చెట్టుకు ఉరివేసుకున్నాడు. 
 
అయితే, కీచకుడు సుబ్బయ్య తనకు తానుగా ఉరి వేసుకున్నాడా? లేక పోలీసులే విధించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబసభ్యుడు మీడియాతో మాట్లాడుతూ సుబ్బయ్య చనిపోలేదని, వేరేవాళ్లు ఉరి వేసి చంపారని ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments