యేడాది పాపపై అత్యాచారం.. ఆపై తలపై కొట్టి చంపిన మానవమృగం

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఒక యేడాది వయసున్న పసికందుపై ఓ 65 యేళ్ల కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై తలపై కొట్టి చంపేశాడో కసాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (17:58 IST)
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఒక యేడాది వయసున్న పసికందుపై ఓ 65 యేళ్ల కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై తలపై కొట్టి చంపేశాడో కసాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తమిళనాడుకు చెందిన ఓ జంట పొట్టచేతపట్టుకుని మహారాష్ట్రలోని పూణెకు వలస వచ్చి శివారు ప్రాంతాల్లో నివశిస్తోంది. ఈ దంపతులిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ యేడాది పాప ఉంది. గురువారం అర్థరాత్రి వారి పాప కనిపించకపోవడంతో రాత్రంతా పాప కోసం గాలించారు.
 
అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో కల్బోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వీధిలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. ఇందులో ఓ వ్యక్తి పాపను ఎత్తుకెళ్లడం అందులో స్పష్టంగా కనిపించింది. 
 
దీంతో ఆరా తీసిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ చిన్నారిపై అత్యాచారం నెరిపిన అనంతరం తలపై కొట్టి చంపేసినట్టు పోలీసులు విచారణ అనంతరం చెప్పాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని మల్హరి బన్సోడేగా గుర్తించారు. చిన్నారి నిద్రపోతుండగా ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. ఈ కామాంధుడి వయసు 65 యేళ్లని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments