Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఊడింది.. అయినా నెలకు పది లక్షలు సంపాదిస్తున్నాడు..!

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (21:53 IST)
పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు గుండెల్లో భయం పట్టుకుంది. ఎప్పుడెప్పుడు ఉద్యోగం ఊడిపోతుందోనని బెంగతో పనిచేసేవారు చాలామంది వున్నారు. అధిక మొత్తం జీతం తీసుకునే వారి నుంచి వేలల్లో తక్కువ మొత్తం తీసుకునే వారి వరకు ప్రస్తుతం ఉద్యోగ భద్రత కరువైంది. 
 
అలాంటి వారిలో ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌కు చెందిన ర్యాన్ మెకాటీర్ కూడా ఒకరు. 25 ఏళ్ల అతను ఉద్యోగాన్ని కోల్పోయాడు. దాంతో ఇక కార్పొరేట్ కంపెనీలను నమ్మి ప్రయోజనం లేదనుకున్న అతను సొంతంగా కార్ల కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఈ కార్ల కంపెనీ ద్వారా ప్రస్తుతం ఆ వ్యక్తి నెలకు పది లక్షలు సంపాదిస్తున్నాడు. సదరు వ్యక్తి తన 19 సంవత్సరాల వయస్సులో తన మొదటి కారును విక్రయించాడని మిర్రర్ నివేదించింది. కానీ అతను ప్రతిష్టాత్మక కార్ కంపెనీలో ఉద్యోగంలో ఉన్నప్పుడు సరిగ్గా పని చేయలేకపోయాడు. కంపెనీలో అంకితభావంతో పనిచేయలేకపోయాను అందుకే ఉద్యోగం ఊడింది.
 
ఆ తర్వాత చాలా కార్ల డీలర్‌షిప్‌లు వాడిన కార్లను లోన్‌పై కొనుగోలు చేసి, నెలల తరబడి నిల్వ చేసుకుంటానని చెప్పాడు. ఈ కార్లను కంపెనీకి వేల నుండి మిలియన్ల వరకు అమ్మాడు.
 
ర్యాన్ స్వయంగా టాప్ పర్‌ఫామర్‌గా మారాడు. ఎందుకంటే కస్టమర్‌లు ఏమి కోరుకుంటున్నారో బాగా తెలుసుకున్నాడు. 22 ఏళ్ళ వయసులో, అతను తన వ్యాపారాన్ని రాక్‌స్టార్ కార్ ఫైనాన్స్ ద్వారా ప్రారంభించాడు. దాని కోసం అతను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన కస్టమర్‌లను కనుగొన్నాడు.
 
ఆ సమయంలో తన వద్ద డబ్బు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేవని ర్యాన్ వెల్లడించాడు. తన వద్ద కస్టమర్లతో కూడిన ఫోన్‌ మాత్రమే వున్నదని.. దానికి ఐడియా కూడా జతకావడంతో బిజినెస్‌లో రాణించగలిగానని.. తద్వారా నెలకు పది లక్షలు సంపాదించగలిగానని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments