Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త... డిగ్రీ పట్టభద్రులకు ఆర్థిక భరోసా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగ భృతి అందజేయాలని నిర్ణయించింది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ని

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (08:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగ భృతి అందజేయాలని నిర్ణయించింది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగుడికి ఈ భృతి అందనుంది.
 
ఇదే అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, నిరుద్యోగ భృతితో ఏపీలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఎన్ని వందల కోట్లయినా కేటాయిస్తామన్నారు. తొలి దశలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పించనున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేలా నిరుద్యోగ భృతి అందించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. 
 
ఈ నెలాఖారులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించాలని అధికారులను యనమల ఆదేశించారు. అర్హుల వయస్సు, విద్యార్హతలపై చర్చించారు. డిగ్రీ పూర్తి చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. అలాగే, నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణనిచ్చి, రాష్ట్రంలో విస్తృతంగా ఏర్పాటవుతోన్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. ఉపాధి కల్పించిన వెంటనే వారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి మినహాయిస్తామని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశమిస్తామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments