Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను విన్నాను.. నేనున్నాను'.. భరోసానిచ్చే "యాత్ర" టీజర్ అదిరింది

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:11 IST)
దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యాత్ర". మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అంటే వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. 
 
పాదయాత్ర సమయంలో రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. 
 
ఈ టీజర్‌లో రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. "పంటపండించే రైతుకు సరైన సమయానికి వర్షాలు పడవు.. కరెంట్ ఉండదు.. అన్ని ఉంటె గిట్టుబాటు ధర ఉండదు అనే రైతే రాజు అంటారు.. రాజుగా కాదు కనీసం రైతును రైతుగా గుర్తిస్తే చాలు" అనే డైలాగ్స్  టీజర్ సాగుతుంది. 
 
దీనికి ప్రతిగా "నేను విన్నాను.. నేనున్నాను" అనే డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవుతుంది. రైతు చుట్టూనే ఈ సినిమా నడుస్తుందని ఇట్టే తెలిసిపోతుంది. మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments