Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన ప్రేమను గెలిచే ప్రయత్నమే 'పాగల్' - ట్రైలర్ రిలీజ్

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (15:05 IST)
విష్వక్సేన్ హీరోగా నిర్మితమైన చిత్రం 'పాగల్'. నివేద పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మించగా, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో ఎవరికి పడితే వాళ్లకి ఐ లవ్ యు చెబుతూ ఉంటాడు. అలాటి హీరో ఒక యువతిని మాత్రం నిజంగానే లవ్ చేస్తాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ అమ్మాయి నో చెబుతుంది. ఆమె ప్రేమను పొందడానికి అతను ఏం చేశాడనేదే కథ అనే విషయం ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 
 
ప్రేమ, హాస్యంతో పాటు ఈ సినిమాలో ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు యువతను, అటు మాస్‌ను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ కథను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. రథన్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా మారుతుందని అనుకోవచ్చు. నివేద పేతురాజ్‌తో పాటు కథానాయికలుగా సిమ్రన్, మేఘలేఖ కనువిందు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments