Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిక్టేటర్ లాంటి వాడిని వేటాడే ఓ కిల్లర్ కథతో విజయ్ ఆంటోనీ హిట్లర్

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (11:38 IST)
Vijay Antony, Rhea Suman
హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా "హిట్లర్"తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో "విజయ్ రాఘవన్" అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా "హిట్లర్" సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. "హిట్లర్" సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా టీజర్ ను రిలీజ్  చేశారు.
 
"హిట్లర్" టీజర్ ఎలా ఉందో చూస్తే - డిక్టేటర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు, అతన్ని వేటాడే ఓ కిల్లర్, ఆ ప్లాన్ ను అడ్డుకుని..కిల్లర్ ను టార్గెట్ చేసిన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్... ఈ మూడు పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ సాగింది. పోలీస్ ఆఫీసర్ టార్గెట్ రీచ్ అయ్యి కిల్లర్ ను పట్టుకోవడం, అయినా కిల్లర్ నవ్వుతూ కనిపించడం టీజర్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లవ్ ట్రాక్ కు కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్లు చూపించారు. కిల్లర్ గా విజయ్ ఆంటోనీ కొత్త లుక్, క్యారెక్టరైజేషన్ లో కనిపించారు. వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ తో టీజర్ ఆకట్టుకుంది.
 
ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే "హిట్లర్". ఈ సినిమాను త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments