Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆత్మహత్య: వైరల్ అవుతున్న తల్లి ఫాతిమా పోస్ట్, ఆంటోనీ వీడియో

Advertiesment
Vijay Antoni
, మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (17:21 IST)
హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువుల్లో రాణిస్తూ వుండే మీరా 16 ఏళ్లకే తీవ్ర ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఐతే ఎంతటి సమస్యకైనా ఆత్మహత్య మార్గం కానేకాదు. క్షణికావేశంలో చాలామంది ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంటారని మానసిక నిపుణులు చెపుతారు.
 
విజయ్ ఆంటోని కుమార్తె మరణవార్త విన్న సినీ ప్రముఖులు ఆయనను ఓదార్చుతున్నారు. మరోవైపు గతంలో విజయ్ ఆంటోని పిల్లల ఆత్మహత్యలపై మాట్లాడిన ఓ వీడియో, అలాగే మీరా తల్లి ఫాతిమా గతంలో ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారాయి.

విజయ్ ఆంటోని పిల్లల ఆత్మహత్యలపై మాట్లాడుతూ... తనకు ఏడేళ్ల వయసులో తన తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలిపారు. ఆ పరిస్థితుల్లో తనను, తన సోదరిని పెంచి పెద్దచేసేందుకు తన తల్లి ఎన్నో కష్టాలు పడిందని గుర్తుచేసుకున్నారు. కనుక ఎవ్వరూ ఎంతటి కష్టం వచ్చినా ఆత్మహత్య అనే ఆలోచన రానీయకూడదని అన్నారు. తన కుమార్తెను తనకు ఇష్టం వచ్చినట్లు వుండేలా ప్రోత్సహిస్తాననీ, చదువుకునే విషయంలోనూ ఎంతో స్వేచ్ఛనిస్తానని చెప్పారు.  పిల్లల విషయంలో వారిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతం చేయను అని ఆ వీడియోలో చెప్పారు.
 
ఇక మీరా తల్లి ఫాతిమా ట్విట్టర్లో చేసిన పోస్ట్ గత మార్చి నెల లోనిది. అందులో ఆమె తన కుమార్తె మీరా సాధించిన విజయం సందర్భంగా.. 'నా బలం వెనుక ఉన్న శక్తి, నా కన్నీళ్లకు ఓదార్పు, నా ఒత్తిడికి కారణం, నా తంగకట్టి-చెల్లకుట్టి, మీరా విజయ్ ఆంటోనీ, కంగ్రాట్స్ బేబీ’ అని రాసారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ సినిమాపై బయోపిక్: సమర్పకుడిగా మారిన రాజమౌళి