Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ సందేశ్, శీతల్ భట్ జంటగా చిత్రం చూడర టీజర్‌ వచ్చేసింది

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (15:34 IST)
Varun Sandesh, Sheetal Bhatt
హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’ చేస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో శీతల్ భట్ కథానాయికగా నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.
 
ఇంటి గోడపై కూర్చున్న వరుణ్ సందేశ్, ధనరాజ్,  కాశీ విశ్వనాథ్‌ల సస్పెన్స్ ఫేస్ లని  ప్రజెంట్ చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. వరుణ్ సందేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని గా కనిపించారు. వరుణ్  క్రైమ్‌లో ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్ భాగస్వాములు. కోర్ పాయింట్‌ను రివిల్ చేయకుండానే టీజర్ సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకొని, సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
 
అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ధన తుమ్మల సహ నిర్మాత. టాలెంటెడ్ కంపోజర్ రధన్ సంగీతం అందిస్తుండగా, జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీరాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. నేనింతే ఫేమ్ అదితి గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో అలరించనుంది.
 
తారాగణం: వరుణ్ సందేశ్, శీతల్ భట్, రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీరాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, అదితి గౌతమ్ (స్పెషల్ ఎప్పిరియన్స్), రచ్చ రవి, కెఎ పాల్ రాము, పింగ్ పాంగ్ సూర్య, రైజింగ్ రాజు తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments