Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై. ఎస్. ఆర్. మరణం నుంచే వర్మ చూపిన వ్యూహం టీజర్‌- వర్మ నిజాలు చెప్పాడా! (video)

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (17:59 IST)
vyuhama photo
సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అనే సంగతి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆర్జీవి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ సీయం వైయస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని ‘వ్యూహం’ అనే  పొలిటికల్‌ డ్రామా తెరకెక్కిస్తున్నారు.  జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటిస్తున్నారు.  శ్రీ రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్‌ 24వ తేది ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన ట్వీట్టర్‌ ద్వారా తెలియచే శారు. 
 
ఈ సినిమా బయోపిక్‌ కాదు. దానికంటే లోతైన రియల్‌ సినిమా అని, ఈ చిత్రంలో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని గతంలోనే ఆర్జీవి తెలియచేసిన సంగతి తెలిసిందే. మామూలుగానే ఆర్జీవి ఏం చేసినా ట్రెండింగ్‌లో ఉంటారు. శనివారం విడుదలయ్యే టీజర్‌లో ఎటువంటి సంచలనాలు క్రియేట్‌ అవుతాయో అని సినిమా, రాజకీయం అనే తేడాలేకుండా అన్ని వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.
 
టీజర్ ఎలావుండఁటే.. 
టీజర్ ఆరంభములో నే వై.ఎస్. హెలికాఫ్టర్ పయనం, ఆ  తర్వాత కూలిపోవడం, ఆ విషయాన్ని జిమ్ లో ఉన్న జగన్ కు ఓ వ్యక్తి హడావుడిగా వచ్చి చెప్పడం, మరో షాట్ లో ఎన్ టి. ఆర్. ఫోటో.. అందులో చంద్ర బాబు కనిపించడం.. జగన్ తన చేతిలో రుద్రాక్ష పట్టుకుని తీవ్రంగా  చూడటం.. వంటి అంశాలు ఉన్నాయి. పోలీస్ ఫోర్స్ రావడం, ఓ ప్రముఖముడు జగన్ ముందు ఓ ఫైల్ ఇవ్వడం, చంద్రబాబు లుక్స్, ఇలా వన్ సైడ్ గా టీజర్ ఉంది.  ఫైనల్ గా అలా ఆలోచించడానికి చంద్రబాబు ను కాదు. అనే డైలాగ్ చెప్పడం.. ముగుస్తుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments