చైనాకు చెందిన ఓ వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. ఏకంగా నాలుగేళ్లకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఈ పోర్టల్‌లో ఓ వస్తువు కోసం ఆర్డర్ చేశాడు.
చైనాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్ అనే వెబ్ పోర్టల్ ప్రస్తుతం మన దేశంలో నిషేధిత జాబితాలో ఉంది. ఈ వెబ్ పోర్టల్‌లే నాలుగేళ్ల క్రితం ఆర్డర్ చేశాడు. అదీ కరోనాకు ముందు.
2019లో చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ పోర్టల్‌పై తాను ఆర్డర్ చేయగా.. అది నాలుగేళ్ల తర్వాత చివరికి ఇటీవలే డెలివరీ అయిందంటూ ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ తెలిపాడు. ఎవరూ ఆశని కోల్పోకూడదంటూ మెసేజ్ ఇచ్చాడు.