ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పట్ల ఇండియా అంతా ఎలాగున్నా తెలుగు పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. చెత్తగా సినిమాను తీసారని ఓం రౌత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంత కల్పితం అయినా రావణాసురుని పాత్ర తీరు, ఆయన సామ్రాజ్యం, ఆయన సైన్యం జంతువులుగా చూపించడం పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా హైదరాబాద్ లో ఐమాక్స్ లో మీడియా అడిగే ఫీడ్ బ్యాక్ ఇవ్వకుండా తప్పించు కున్నాడు.
ఇక జై శ్రీరామ్ అనే నినాదంతో ఇండియాలో చాల చోట్ల పలు సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. పిల్లలకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నారు. రోరోజు కూ కలెక్షన్ వందల కోట్లు వస్తుందని చెపుతున్నారు. ఇదంతా ఒకభాగమైతే విదేశాల్లో మరోలా ఉంది ప్రభాస్ కు జపాన్లో ఫాన్స్ ఉన్నారు. బాహుబలి సినిమా అక్కడ రిలీజ్ అయింది. దాంతో ప్రబాస్ కు డై హార్ట్ ఫాన్స్ కూడా ఉన్నారు. అందులో భాగముగా జపాన్‌కు చెందిన నేటియా అనే అభిమాని చిన్న వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నేను నేటియా ప్రభాస్‌కి అభిమాని. ఆదిపురుష్ సినిమా చూడటానికి టోక్యో నుండి సింగపూర్ వచ్చాను.. అంటూ ప్రభాస్ ఉన్న కారూన్ పోస్టర్ చూపించింది.