Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను-కీర్తన ట్రైలర్ కు అనూహ్య స్పందన

డీవీ
గురువారం, 22 ఆగస్టు 2024 (10:33 IST)
Neu-Kirtan trailer
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన "నేను కీర్తన" ప్రచారచిత్రానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఎమ్.ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీత సారధి. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న "నేను కీర్తన" చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. 
 
రేణు ప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

ప్రైవేట్ లోన్ యాప్ వేధింపులు... బలైపోయిన మెదక్ జిల్లా వ్యక్తి

ఆప్ ఎంపీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా!

Sandhya Theatre Stampede: పుష్ప-2.. సంధ్య థియేటర్ తొక్కిసలాట- శ్రీతేజ్ బ్రెయిన్ డెత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments