Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

Advertiesment
Chimata Ramesh Babu  Murali Mohan

డీవీ

, బుధవారం, 26 జూన్ 2024 (15:27 IST)
Chimata Ramesh Babu Murali Mohan
"ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా అరుదుగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "నేను - కీర్తన" ట్రైలర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్స్ లో కచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు ప్రముఖ నటులు - మాజీ పార్లమెంటు సభ్యులు - జయభేరి అధినేత మాగంటి మురళీమోహన్. "నేను - కీర్తన" చిత్రం నుంచి "కొంచెం కొంచెం గుడుగుడు గుంజం" అనే ఐటమ్ సాంగ్ ను మురళీమోహన్ ఆవిష్కరించారు. 
 
చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో విడుదల కానుంది. 
 
సినిమాలు, స్థిరాస్తి, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రతిభాశాలి మాగంటి మురళీమోహన్ తమ చిత్రం నుంచి ఐటమ్ సాంగ్ విడుదల చేసి, తమ సినిమా ఘన విజయం సాధించాలని అభిలషించడం పట్ల  చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "నేను - కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. 
 
సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.). 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌