Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహర్షి రాఘవ... రికార్డ్ బ్రేక్... వందసార్లు రక్తదానం.. చిరు సత్కారం!!

raghava - chiru

వరుణ్

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (11:31 IST)
సినీ నటుడు మహర్షి రాఘవ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఏకంగా వంద సార్లు రక్తదానం చేశారు. హైదరాబాద్ నగరంలోని చిరంజీవి రక్తదాన కేంద్రంలో ఆయన తాజాగా వందోసారి రక్తదానం చేశారు. ఆయనను మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. 1998 అక్టోబరు రెండో తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రారంభమైంది. తొలుత రక్తం ఇచ్చిన వ్యక్తి సినీ నటుడు మురళీమోహన్. రెండో వ్యక్తి మహర్షి రాఘవ. అప్పటి నుంచి మహర్షి రాఘవ క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన వందో సారి ఇచ్చి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. మహర్షి రాఘవ దంపతులతో పాటు మురళీమోహన్‌ను తన నివాసానికి పిలిపించి చిరు సత్కారం చేశారు. మహర్షి రాఘవకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వందసార్లు రక్తదానం చేయడం చాలా అరుదైన గొప్ప విషయంగా చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ రావడం మామూలు విషయం కాదంటూ రాఘవ సేవాగుణాన్ని చిరంజీవి కొనియాడారు. అలాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆయన సూచించారు.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి తదుపరి సీఎం ఎవరు? రఘుబాబు, విశాల్ స్పందన ఇదే