Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణాన్ని వణికించే మహారాజు కథే డాకూ మహారాజ్ గా టీజర్ విడుదల

డీవీ
శుక్రవారం, 15 నవంబరు 2024 (10:51 IST)
Dakoo Maharaj
నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న చిత్రం టైటిల్ డాకూ మహారాజ్. టీజర్ ను ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేశారు. ఇటీవలే తాజా అప్ డేట్ లో బాలక్రిష్ణ టైటిల్ గురించి పాఠకులకు విదితమే. అదే డాకు మహారాజ్ టైటిల్ ను నేడు ప్రకటించారు. దానితోపాటు టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ ఎలా వుందంటే...
 
ఎడారిప్రాంతంలో వుండే చోట గుర్రాలతో కొందరు ప్రయాణిస్తుంటారు. ఓ వాయిస్ ఓవర్ తో ఈ కథ వెలుగు పంచే దేవుళ్ళది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రాముడిది కాదు. ఈ కథ. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించే మహారాజుది. డాకు మహారాజ్.. అంటూ వస్తుంది. ముసుగువేసుకున్న బాలక్రిష్ణ గెటప్ కొద్దిగా రిలీవ్ అవుతుంది. కత్తులతో యుద్దం చేసే సీన్స్ కనిపిస్తాయి. సో. ఇది పూర్తి మాస్ చిత్రంగా అనిపిస్తుంది. థమన్ నేపథ్యం తగినట్లుగా వుంది.
 
ఈ చిత్రం సంక్రాంతికి 12వ తేదీన విడుదలకానుంది. సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. బాలక్రిష్ణ ఇమేజ్ ను ద్రుష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చేనెలలో ట్రైలర్ విడుదలకానున్నదని చిత్ర యూనిట్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలిక గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

మాదన్నపేటలో వృద్ధురాలిపై దాడి చేయించిన కానిస్టేబుల్

wolf attack: తోడేళ్ల దాడి.. పంట పొలాల గుడిసెలో నిద్రిస్తున్న దంపతుల మృతి

బాలకృష్ణకి మెంటల్ వచ్చి తుపాకీతో కాలిస్తే వైఎస్సార్ కాపాడారు: రవీంద్రనాథ్ రెడ్డి (video)

కడపలో వైకాపా రూల్ : వైకాపా కార్యకర్తలపై కేసు పెట్టారని సీఐపై బదిలీవేటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments