Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ యాపిల్ లాంటి అప్సర రాణీ కాశ్మీర్ మిర్చి లా నటించింది

డీవీ
గురువారం, 21 మార్చి 2024 (17:18 IST)
Apsara Rani
రాంగోపాల్ వర్మ సినిమాలో లెస్బియన్ గా నటించి మెప్పించిన గ్లామర్ బ్యూటీ అప్సర రాణీ ఇప్పుడు పాత్రలు ఎంపికల విషయంలో తగు జాగ్రత్తలు చేసుకుంటుంది. గ్లామర్ తో పాటు యాక్షన్ కథలు చేస్తుంది. లేటెస్ట్ గా తలకోన సినిమా కోసం ఫైట్స్ చేశానని చెప్పింది.

అక్షర క్రియేషన్ పతాకంపై  నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన" . ఈ చిత్రం అన్ని  హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, Ds రావు, ప్రముఖ హీరో రమాకాంత్  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేశారు.
 
హీరోయిన్ అప్సర రాణీ మాట్లాడుతూ"నా కెరీర్ లో ఈ చిత్రం డెఫినెట్ గా ఓ మైలు రాయి గా నిలుస్తుంది. నేనింతవరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్ & క్లాస్ ఆడియన్స్ కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
 
దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. అప్సర రాణీ నీ  చూస్తే కాశ్మీర్ యాపిల్ ల కనిపిస్తుంది.కానీ ఈ సినిమాలో  తను  కాశ్మీర్ మిర్చి లా నటించింది. చాలా వెరైటీ స్టోరీ ఇది .షూటింగ్ "తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా  లాంటి చిన్న సినిమాలకు  సరైన షోస్ ఇచ్చి సినిమాలను బ్రతికించాలని ఈ సందర్భంగా  నేను కోరుకుంటున్నాను " అని అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments